ప్రైవేట్ బస్సులకు నో పర్మిషన్.. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు…

|

Dec 01, 2019 | 9:47 PM

ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన కేసీఆర్.. వారితో మధ్యాహ్నం లంచ్  చేశారు. ఇక ఆ తర్వాత ఆర్టీసీపై వరాల జల్లు కురిపించారు. కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రేపు.. సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రతీ ఆర్టీసీ డిపోలోనూ మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు. అంతేకాక ఆర్టీసీ మనుగడ కోసం […]

ప్రైవేట్ బస్సులకు నో పర్మిషన్.. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు...
Follow us on

ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన కేసీఆర్.. వారితో మధ్యాహ్నం లంచ్  చేశారు. ఇక ఆ తర్వాత ఆర్టీసీపై వరాల జల్లు కురిపించారు. కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రేపు.. సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రతీ ఆర్టీసీ డిపోలోనూ మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు. అంతేకాక ఆర్టీసీ మనుగడ కోసం కార్మికులందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మరోవైపు  మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు.. రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వడమే కాకుండా.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇకపోతే ఉద్యోగాల విషయంలో ఎలాంటి భయం పెట్టుకోవలసిన అవసరం లేదని.. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అటు టికెట్ తీసుకోకుండా ప్రయాణించేవారికి భారీ ఫైన్లు విధించాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులకు నైట్ షిఫ్ట్స్ రద్దు చేయడమే కాకుండా.. ప్రసూతి సెలవులను పెంచనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉద్యోగుల పిల్లలకు కూడా రూట్ పాస్‌లు ఇవ్వాలని సూచించారు. అటు ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని.. ఏ ఒక్క రూట్‌లోనూ ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇవ్వమని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆర్టీసీ‌లో ఖాకీ యూనిఫామ్‌కు స్వస్తి…

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ తీపికబురు అందించారు. ఇకపై ఖాకీ యూనిఫామ్ ఆర్టీసీలో ఉండదని.. త్వరలోనే ఉద్యోగులకు ఇస్టమైన రంగులోనే కొత్త యూనిఫామ్ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులను ఇకపై ఆర్టీసీ కార్మికులుగా పిలవద్దని సీఎం సూచించారు.