పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కౌశల్

|

Mar 15, 2019 | 10:21 AM

బిగ్ బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ మందాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఆయన పేరిట ఆర్మీ పెట్టి మరీ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే కౌశల్ ఇటీవల సీ.ఏం చంద్రబాబు ను కలిశారు. ఇక కౌశల్ ను విశాఖ నుంచి ఎంపీగా నిలబెడతారని మీడియాలో ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు జనసేన తరుపున విశాఖ ఎంపీ టికెట్ పై పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ నేపథ్యంలో […]

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కౌశల్
Follow us on

బిగ్ బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ మందాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఆయన పేరిట ఆర్మీ పెట్టి మరీ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే కౌశల్ ఇటీవల సీ.ఏం చంద్రబాబు ను కలిశారు. ఇక కౌశల్ ను విశాఖ నుంచి ఎంపీగా నిలబెడతారని మీడియాలో ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు జనసేన తరుపున విశాఖ ఎంపీ టికెట్ పై పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ నేపథ్యంలో కౌశల్ మందా అధికారకంగా స్పందించాడు.

కౌశల్ మాటల్లోనే..

నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అసలు నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే బిగ్ బాస్ లో విజేతగా నిలిచిన తర్వాతే వెళ్ళేవాడిని. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం.. ఆయన నటన.. ఆయన వైఖరి అన్నా చాలా ఇష్టం. మరోవైపు చంద్రబాబు గారి లాంటి తెలివైన రాజకీయ నాయకుడు నా గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాజకీయ నాయకుల్లో నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇకపోతే నా వ్యక్తిగత ఇష్టాలు నాకున్నాయి. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను. నేను ఇప్పుడు ఏ పార్టీ తరుపున ప్రచారం చేయట్లేదు.. ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉంటాను.

కాగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేస్తాడనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ కౌశల్ మీడియాకు క్లారిటీ ఇచ్చేశాడు. సో భవిష్యత్తులో కౌశల్ ఏమి చేస్తాడో వేచి చూడాల్సిందే.