కర్నాటకలో 18 వేల మార్క్ దాటిన కరోనా కేసులు

|

Jul 02, 2020 | 8:25 PM

కర్నాటకలో గురువారం కొత్తగా 1,502 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 18,016కు చేరింది. ఇక, ఇవాళ కొత్తగా 19 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కర్నాటకలో 18 వేల మార్క్ దాటిన కరోనా కేసులు
Follow us on

కర్నాటకలో క‌రోనా వైరస్ విజృంభణ నానాటికి పెరగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా కట్టడి చర్యలు చేపడుతున్నప్పటికీ మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18 వేల మార్క్ దాటడంతో అధికారులతో పాటు జనంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గురువారం కొత్తగా 1,502 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 18,016కు చేరింది. ఇక, ఇవాళ కొత్తగా 19 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తంగా 272 మంది కరోనాను జయించలేక మృత్యువాతపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 9,406 మంది కరోనా బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకూ 8,334 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.