అంతా కర్నాటకీయం.. బలపరీక్షకు ముగిసిన డెడ్‌లైన్

| Edited By:

Jul 19, 2019 | 2:03 PM

కర్నాటక అసెంబ్లీలో గందరగోళం జరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. చర్చను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. బలపరీక్షకు గవర్నర్ పెట్టిన డెడ్‌లైన్ ముగియడంతో.. ఎమ్మెల్యేల రాజీనామాలపై చర్చ జరపాలని సీఎం కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. అంతేకాకుండా అసలు నాకు డెడ్‌లైన్ విధించే అధికారం గవర్నర్‌కు ఉందా..? అని స్పీకర్‌ను ప్రశ్నించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్ పై కుమారస్వామి విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు […]

అంతా కర్నాటకీయం.. బలపరీక్షకు ముగిసిన డెడ్‌లైన్
Follow us on

కర్నాటక అసెంబ్లీలో గందరగోళం జరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. చర్చను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. బలపరీక్షకు గవర్నర్ పెట్టిన డెడ్‌లైన్ ముగియడంతో.. ఎమ్మెల్యేల రాజీనామాలపై చర్చ జరపాలని సీఎం కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. అంతేకాకుండా అసలు నాకు డెడ్‌లైన్ విధించే అధికారం గవర్నర్‌కు ఉందా..? అని స్పీకర్‌ను ప్రశ్నించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్ పై కుమారస్వామి విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని కుమారస్వామి విమర్శించారు. అయితే ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఆఫర్ చేస్తున్నప్పుడు మేము మాత్రం ఏం చేయగలమని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఇక అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ రమేశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు పద్దతిని పాటించడంలేదని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ సభ్యులు బలపరీక్షకు పట్టుబడుతున్నారు. అయితే విశ్వాస పరీక్ష పై చర్చ ముగిసే వరకు బలపరీక్ష లేదని స్పీకర్ తేల్చి చెప్పారు.