కంగనా రనౌత్ కి, , ఆమె సోదరికి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. దేశద్రోహం కేసులో వీరికి సమన్లు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఓ కాస్టింగ్ డైరెక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని వీరికి వీటిని జారీ చేశామని, వీరు ఈ నెల 26, 27 తేదీలలో అధికారుల ఎదుట హాజరు కావలసి ఉంటుందని వారు చెప్పారు. బాలీవుడ్ ని కంగనా సిస్టర్స్ మతప్రాతిపదికన చీల్చజూస్తున్నారని ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఆరోపించారు.