ప్రేయసితో సహా.. ఆ ఆటగాడికి కరోనా..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు, జువెంటస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సభ్యుడు పౌలో డైబాల కరోనాతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్షల ఫలితాల్లో తనకు, తన ప్రేయసి ఒరియానాకు పాజిటివ్‌గా తేలిందని ట్విటర్‌లో వెల్లడించాడు.

ప్రేయసితో సహా.. ఆ ఆటగాడికి కరోనా..!

Edited By:

Updated on: Mar 22, 2020 | 4:09 PM

Corona Pandemic: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు, జువెంటస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సభ్యుడు పౌలో డైబాల కరోనాతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్షల ఫలితాల్లో తనకు, తన ప్రేయసి ఒరియానాకు పాజిటివ్‌గా తేలిందని ట్విటర్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం తామిద్దరం ఆరోగ్యంగానే ఉన్నామని, తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు చెప్పాడు. జువెంటస్‌ క్లబ్‌లో.. పౌలో కన్నా ముందు బ్లెయిసె మాటుడి, డానియల్‌ రుగాని అనే ఇద్దరు ఆటగాళ్లు ఈ వైరస్‌బారిన పడ్డారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఇటలీ టాప్‌-ఫ్లైట్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌, సిరీస్‌ ఏ లీగ్‌ ఏప్రిల్‌ 3 వరకు వాయిదా పడ్డాయి.