2021 ద్వితీయార్థానికల్లా భారత్‌లో 5జీ సేవలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించాలి : ముకేశ్‌ అంబానీ

5జీ స్మార్ట్‌ ఫోన్లను కాస్త సరసమైన ధరలకు అందించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ముకేశ్‌ అంబానీ కోరారు. ప్రధాని మోదీ డిజిటల్‌ మిషన్‌ కారణంగానే కోవిడ్‌-19లోనూ భారత్ నెట్టుకురాగలిగిందన్నారు.

2021 ద్వితీయార్థానికల్లా భారత్‌లో 5జీ సేవలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించాలి : ముకేశ్‌ అంబానీ

Updated on: Dec 08, 2020 | 1:45 PM

Jio 5G to Launch in India by Late 2021: 2021 ద్వితీయార్థానికల్లా భారత్ లో 5జీ సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని చర్యలు భారత్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగే భారత్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు 2020లో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, టెలికాం మంత్రి రవిశంకర ప్రసాద్‌ లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చాలా అంశాలను ప్రస్తావించారు. 5జీ స్మార్ట్‌ ఫోన్లను కాస్త సరసమైన ధరలకు అందించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ముకేశ్‌ అంబానీ కోరారు. ప్రధాని మోదీ డిజిటల్‌ మిషన్‌ కారణంగానే కోవిడ్‌-19లోనూ భారత్ నెట్టుకురాగలిగిందన్నారు. స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గితే చాలామంది ప్రజలు డిజిటల్‌ సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

అలాగే లాక్ డౌన్ సమయంలో దేశమంతటా విస్తరించిన 4జీ నెట్‌వర్క్‌ ప్రజలకు తోడ్పడిందన్నారు. కానీ దేశంలో దాదాపు 30 కోట్లమంది పైగా 2జీ నెట్‌వర్క్‌ ఉపయోగిస్తున్నారన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ విజన్‌లో జియో 5జీ సర్వీసులు భాగం కావడంతో తాము డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ సైతం డిజిటల్‌ కనెక్టెడ్‌ దేశాల జాబితాలో ముందుందన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఆధునిక సాంకేతితతో ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, వాణిజ్య విభాగాలలో కొత్తతరహా సర్వీసులను అందిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయిలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కు గాను భారత్ లోనే తయారీని బలపరుచుకోవలసి ఉందన్నారు.