ఝార్ఖండ్ ఎన్నికలు.. పిస్టళ్లతో అభ్యర్థులు

|

Nov 30, 2019 | 6:45 PM

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 62.87 శాతం ఓటర్లు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాల్లో కొన్నింటిలో నక్సల్స్ బెడద ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా-ఈ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారులు హల్చల్ చేశారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు […]

ఝార్ఖండ్ ఎన్నికలు.. పిస్టళ్లతో అభ్యర్థులు
Follow us on

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 62.87 శాతం ఓటర్లు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాల్లో కొన్నింటిలో నక్సల్స్ బెడద ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా-ఈ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారులు హల్చల్ చేశారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దల్తోన్ గంజ్ నియోజకవర్గం చైన్ పూర్ బ్లాక్ లోని కోసియారా గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎన్. త్రిపాఠీ ఒక దశలో జేబులోనుంచి పిస్టల్ తీశారు. తనను అడ్డుకుంటున్న బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా మద్దతుదారులను ఎదుర్కొనేందుకు ఆయన నేరుగా వారిపైకి రివాల్వర్ ని ఎక్కుపెట్టినంత పని చేశారు. తనపై వారు రాళ్లు విసిరారని, తనను చంపాలని చూశారని త్రిపాఠీ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు మారణాయుధాలతో ఓటర్లను భయపెడుతున్నారని బీజేపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.