Jeff Bezos Donation: సంపాదించడంలోనే కాదు.. దానం చేయడంలోనూ ఆయనకు సరిలేరెవరూ.. అమేజాన్‌ సీఈఓ భారీ వితరణ..

|

Jan 05, 2021 | 2:45 PM

Amazon CEO Jeff Bezos: అతను ప్రపంచంలోనే అత్యంత కుభేరుడు. ఆయన నిమిషం ఆదాయం రూ. కోట్లలో ఉంటుంది. సంపద సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.. అయితే..

Jeff Bezos Donation: సంపాదించడంలోనే కాదు.. దానం చేయడంలోనూ ఆయనకు సరిలేరెవరూ.. అమేజాన్‌ సీఈఓ భారీ వితరణ..
Follow us on

Amazon CEO Jeff Bezos: అతను ప్రపంచంలోనే అత్యంత కుభేరుడు. ఆయన నిమిషం ఆదాయం రూ. కోట్లలో ఉంటుంది. సంపద సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.. అయితే కేవలం సంపాదనలోనే కాదు దాన్ని ఖర్చు చేసే విధానంలోనూ రికార్డు సృష్టించారు అమేజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌.
డబ్బులు సంపాదించడంలోనే కాదు.. విరాళాలు ఇవ్వడంలోనూ తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నారు బెఫ్‌ బెజోస్‌. 2020లో బెజోస్‌ ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు ఖర్చు చేశారు. దీంతో జెఫ్‌ బెజోస్‌.. ‘ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీ’వార్షిక జాబితాలో ముందు వరసలో నిలిచారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ఉద్దేశించి ఆయన ఈ విరాళాలను అందజేశారు. బెజోస్‌ తర్వాత నైక్‌ వ్యవస్థాపకుడు ఫిల్‌నైట్‌ స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా నైట్‌ ఫౌండేషన్‌ కోసం 900 మిలియన్ల డాలర్లను విరాళంగా అందించాడు. ఆయన సతీమణి పెన్నీ ఒరిగాన్ యూనివర్సిటీకి 300 మిలియన్ డాలర్లను అందించి జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అలాగే ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్ బర్గ్, ఆయన సతీమణితో కలిసి 250 మిలియన్ డాలర్లను సేవ కార్యక్రమాల కోసం అందించారు.

Also Read: Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యం… రెండు నెలలుగా కనపడని వైనం…