మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తాడిపత్రి ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Dec 27, 2020 | 4:11 PM

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడితో పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తాడిపత్రి ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్
Follow us on

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడితో పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో గురువారం తన ఇంట్లో జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ ఆధారంగా సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయాలని జేసీ డిమాండ్ చేశారు. తాము కేసు పెట్టమంటే… పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయని నిరాకరిస్తున్నారని తెలిపారు. తాను కేసు పెడితే పోలీసులే ఇబ్బంది పడతారని ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి పెద్దారెడ్డి వెళ్లడం, దీంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం అట్టుడికిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారని జేసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. అక్కడే కాసేపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది. ఇంత జరిగినప్పటికీ తనపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.