అమెరికాలో తానా 22వ మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు బీజేపీ గూటికి చేరుతుండగా జనసేన కూడా భవిష్యత్తులో బీజేపీతో కలిసి అడుగులు వేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నిటినీ కొట్టిపారేశారు జనసేన అధ్యక్షుడు పవన్. బీజేపీతో కలిసి వెళ్లే ఛాన్స్ లేదన్నారు. రామ్ మాధవ్‌తో గతంలో కలిసి పనిచేసినందుకే మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు.
పవన్. మరోవైపు ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఈ అంశంపై జనంలో ఆసక్తి ఉండాలని అప్పుడే దాన్ని సాధించుకోగలమని చెప్పారు. దానికోసం కేంద్రంతో ఎలాంటి పోరాటమైనా చేయగలమని, ప్రజల్లోనే దానిపై ఇంట్రెస్ట్ లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.