రాజస్తాన్ లో ఓ జర్నలిస్టును దుండగులు దారుణంగా హత్య చేశారు. జైపూర్ లో 27 ఏళ్ళ అభిషేక్ సోనీ అనే 27 ఏళ్ళ వీడియో జర్నలిస్ట్ ఇటీవల తన తోటి జర్నలిస్ట్ అయిన స్నేహితురాలితో దగ్గరలోనే ఉన్న హోటల్ కి వెళ్లగా ముగ్గురు దుండగులు వెంటబడి ఆమెను అసభ్యంగా వేధించారు. ఇందుకు అభిషేక్ వారిని అడ్డుకోవడంతో మాటామాటా పెరిగింది. దుండగులు రాడ్లతో అతనిపై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అభిషేక్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మహిళా జర్నలిస్టు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులు ముగ్గురిలో ఒకరిని అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ….. గెహ్లాట్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ..జర్నలిస్టులను రక్షించడంలో ఈ సర్కార్ ఘోరంగా విఫలమవుతోందని ఆరోపించింది. రెండేళ్లుగా ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా అన్నారు.