ఈ నెల 22న జగనన్న పచ్చతోరణం..

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో జగనన్న పచ్చతోరణం పేరిట ఈ నెల 22న ఏపీ అటవీశాఖ 71వ వన మహోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా

ఈ నెల 22న జగనన్న పచ్చతోరణం..

Edited By:

Updated on: Jul 21, 2020 | 6:02 AM

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో జగనన్న పచ్చతోరణం పేరిట ఈ నెల 22న ఏపీ అటవీశాఖ 71వ వన మహోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ ఏడాది గ్రామాల్లో 1.02 కోట్ల మొక్కలు నాటాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.