భారత క్రికెటర్‌తో నర్స్ చాటింగ్.. బెట్టింగ్ వలలో వేసేందుకు ప్రయత్నం.. విచారణలో ఏం తేలింది.?

|

Jan 06, 2021 | 6:15 PM

Delhi Nurse IPL Player: ఐపీఎల్ 13 సమయంలో క్రికెట్ బెట్టింగ్ జరిగిందని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్ అజిత్ సింగ్ వెల్లడించారు. టోర్నీ...

భారత క్రికెటర్‌తో నర్స్ చాటింగ్.. బెట్టింగ్ వలలో వేసేందుకు ప్రయత్నం.. విచారణలో ఏం తేలింది.?
Follow us on

Delhi Nurse IPL Player: ఐపీఎల్ 13 సమయంలో క్రికెట్ బెట్టింగ్ జరిగిందని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్ అజిత్ సింగ్ వెల్లడించారు. టోర్నీ జరుగుతున్నప్పుడు ఢిల్లీకి చెందినా ఓ నర్సు టీమిండియా ప్లేయర్‌ను బెట్టింగ్ వలలో వేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు ఢిల్లీకి చెందిన వైద్యురాలిగా క్రికెటర్‌తో చాటింగ్ చేసింది. ఆమెతో సదరు క్రికెటర్ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. అభిమానిని అంటూ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత కోవిడ్ 19 సలహాలను సదరు ఆటగాడికి ఇచ్చేది.

నర్సు సాధారణంగా చాటింగ్ చేసేది. ఎప్పుడైతే బెట్టింగ్ గురించి బీసీసీఐ సమాచారం కావాలని సదరు క్రికెటర్‌ను అడగగానే.. అతడు కోపగించుకునేవాడు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేశాం. ఆ నర్సును ప్రశ్నించాం. ఎలాంటి సమాచారం లభించలేదు. అలాగే ఆటగాడి వివరణ సంతృప్తికరంగా అనిపించడంతో కేసు క్లోజ్ చేశామని అజిత్ సింగ్ అన్నారు.

Also Read:

కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!