ఆగస్టు 2న ఐపీఎల్ కమిటీ భేటీ

|

Jul 29, 2020 | 6:09 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి క్రికెట్ ఐపీఎల్ నిర్వహణకు తుది కసరత్తు మొదలైంది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఎప్పటి నిర్వహించాలనేదానిపై లీగ్‌ పాలక మండలి వచ్చేనెల ఆగస్టు 2న సమావేశం కానుంది.

ఆగస్టు 2న ఐపీఎల్ కమిటీ భేటీ
Follow us on

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి క్రికెట్ ఐపీఎల్ నిర్వహణకు తుది కసరత్తు మొదలైంది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఎప్పటి నిర్వహించాలనేదానిపై లీగ్‌ పాలక మండలి వచ్చేనెల ఆగస్టు 2న సమావేశం కానుంది. కరోనా విలయంతో ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్న భారత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ లీగ్ ను త్వరలోనే నిర్వహించేలా ఫ్లాన్ చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ టోర్ని నిర్వహణపై కమిటీ చర్చించనుంది. యూఏఈ వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జరుగనున్నట్లు సమాచారం. తొలుత సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు ఈవెంట్‌ నిర్వహిస్తామని లీగ్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఆయనే పాలక మండలి సమావేశంపై మీడియాకు తెలిపారు. 2న జరిగే మీటింగ్‌లో లీగ్‌పై తుదిరూపు ఖరారవుతుందని, ఎనిమిది ఫ్రాంచైజీలకు పూర్తి స్పష్టత వస్తుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇది గనక మొదలైతే, కరోనాతో ఇంటిపట్టున ఉంటున్న క్రికెట్ అభిమానులకు ఫుల్ జోష్ రానుంది.