IPL 2022 Points Table: తగ్గేదేలే.. రెండో స్థానానికి దూసుకొచ్చిన గుజరాత్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ ఎవరి వద్ద ఉందంటే..

| Edited By: Anil kumar poka

Apr 09, 2022 | 6:42 PM

IPL 2022 Points Table: ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఇప్పటివరకు అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ నిన్న (ఏప్రిల్ 8) జరిగింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి విజయం సాధించింది.

IPL 2022 Points Table: తగ్గేదేలే.. రెండో స్థానానికి దూసుకొచ్చిన గుజరాత్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ ఎవరి వద్ద ఉందంటే..
Pbks Vs Gt
Follow us on

IPL 2022 Points Table: ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఇప్పటివరకు అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ నిన్న (ఏప్రిల్ 8) జరిగింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. రాహుల్ తెవాతియా చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాడు. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఆ జట్టుఖాతాలో మొత్తం 6 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో పోరాడి ఓడిన పంజాబ్‌ 5 నుంచి 6వ స్థానానికి పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ఇక మిగతా జట్ల విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌ ముందు వరకు రెండో స్థానంలో ఉన్న లక్నో మూడో స్థానానికి పడిపోయింది. సంజూశామ్సన్‌ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ( రెండు విజయాలు, ఒక ఓటమి) ఐదో ప్లేసులో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ( ఒక గెలుపు, రెండు ఓటమి) ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా టోర్నీలో విజయాల ఖాతా తెరవని చెన్నై వరుసగా 8,9 వ స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అట్టడుగు స్థానంలో ఉంది.

రెండో స్థానానికి శుభ్‌మన్‌..

ఇక టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లకు బహూకరించే ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టోర్నీలో అతను ఇప్పటివరకు 143 స్ట్రైక్‌ రేట్‌తో 205 పరుగులు సాధించాడు. ఇందులో ఇక సెంచరీ, హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. ఇక వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసిన గుజరాత్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (3 మ్యాచ్‌ల్లో 180 రన్స్‌) రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. అదేవిధంగా గుజరాత్‌తో మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన లివింగ్‌ స్టోన్‌ (4 మ్యాచ్‌ల్లో 162 పరుగులు) మూడో ప్లేసులోకి వచ్చాడు. 4 మ్యాచ్‌ల్లో 149 రన్స్‌ చేసిన క్వింటన్‌ డికాక్‌ నాలుగో స్థానంలో ఉండగా.. 3 మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేసిన ముంబై బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఐదో ప్లేసుకు పడిపోయాడు.

చెక్కుచెదరని  ఉమేశ్‌ ప్లేస్..

ఇక టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు అందించే పర్పుల్‌ క్యాప్‌ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ (7వికెట్లు) రెండో స్థానంలో ఉండగా.. పంజాబ్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌ (7వికెట్లు) మూడో ప్లేసులోకి దూసుకొచ్చాడు. లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ (7 వికెట్లు) నాలుగో స్థానానికి పడిపోగా.. ఢిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (6 వికెట్లు) ఐదో ప్లేసులో కొనసాగుతున్నాడు.

Also Read: Mango Ice Cream: పిల్లలకు ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా..

Mango Ice Cream: పిల్లలకు ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా..

Mango Ice Cream: పిల్లలకు ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా..