యూఏఈలోనే ఐపీఎల్ 2021 నిర్వహణ!

|

Sep 20, 2020 | 6:07 PM

కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ను కూడా అక్కడే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందట.

యూఏఈలోనే ఐపీఎల్ 2021 నిర్వహణ!
Follow us on

కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ను కూడా అక్కడే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందట. దేశంలో కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే జనవరి వరకు కరోనారహిత ఇండియా కావడం అసాధ్యం. దీంతో 2021 ఐపీఎల్‌తో పాటు వచ్చే ఏడాది జరిగే భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌ను కూడా యూఏఈలో నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. (IPL 2021)

ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు, పరస్పర సహకారంతో టోర్నీల నిర్వహణ జరపాలని బీసీసీఐ, యూఏఈ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఒక ప్రత్యేక ఎంఓయూ కూడా కుదిరిందని తెలుస్తోంది. దీనిపై శనివారం యూఏఈ బోర్డుతో జరిగిన సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాల్గొన్నారని సమాచారం.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..