‘గెలుపు దాకా వచ్చి.. ఓడిపోయాం’

నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కెప్టెన్ డేవిడ్ వార్నర్

గెలుపు దాకా వచ్చి.. ఓడిపోయాం

Updated on: Oct 25, 2020 | 5:36 PM

IPL 2020: ఐపీఎల్‌ 13లో భాగంగా నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ పేలవ ఆటతీరు కనబరిచారు. ఇదిలా ఉంటే జట్టు ఓటమిపై మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

‘గెలుపుకు చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయినందుకు బాధగా ఉంది. పంజాబ్‌ను మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అంతేకాదు లక్ష్యచేధనలో శుభారంభం దక్కింది. కానీ ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాం. పంజాబ్ బౌలర్లు కొత్త బంతితో రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌ను మర్చిపోయి ముందుకు సాగుతాం” అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్ ఓటమితో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..