
ఐపీఎల్-13లో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మోత మోగించింది. కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటింగ్‌లో ఉతికి ఆరేసింది. ఆదిలో రోహిత్ శర్మ(80) సిక్సర్లతో హోరెత్తించగా, కెప్టెన్‌కు తోడుగా సూర్యకుమార్ యాదవ్(47) తనదైన శైలిలో విజృంభించాడు. అలాగే సౌరభ్ తివారి(21), హార్దిక్ పాండ్యా(18) ఫర్వాలేదనిపించారు. ఒకదశలో ముంబై 200 మార్క్ దాటేలా కనిపించినా.. చివర్లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో ముంబై 20 ఓవర్లకు 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో మావి రెండు వికెట్లు.. రసెల్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. (IPL 2020)