రాజస్థాన్‌ రాయల్స్‌ : భారమంతా విదేశీ ఆటగాళ్లపైనే

|

Sep 14, 2020 | 4:01 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో  సెప్టెంబర్ 19 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌ ప్రారంభం కానుంది.

రాజస్థాన్‌ రాయల్స్‌ :  భారమంతా విదేశీ ఆటగాళ్లపైనే
Follow us on

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో  సెప్టెంబర్ 19 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే జట్లన్నీ కఠోర సాధన చేస్తూ కప్ దక్కించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌  జట్టు కూడా బరిలోకి దిగేందుకు రెడీ అయిపోయింది. కాకపోతే జట్టులో ఉన్న భారతీయ, విదేశీ ప్లేయర్స్  కాంబినేషన్ లో సమతుల్యత కొరవడింది. విదేశీ ఆటగాళ్లలో, ముఖ్యంగా స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్లు సమయం అనుకూలిస్తే మైదానంలో అద్భుతాలు చేస్తారు. ఇన్నింగ్స్‌కు కిక్-స్టార్ట్ ఇచ్చేందుకు బట్లర్‌కు ఉండగా, బౌలింగ్ అటాక్‌కు ఆర్చర్ నాయకత్వం వహించనున్నాడు. కాకపోతే ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఎవరూ లేనందున.. విదేశీ ఆటగాళ్లైన డేవిడ్ మిల్లర్, టామ్ కుర్రాన్, ఆండ్రూ టై, ఓషాన్ థామస్ లపై అధిక బాధ్యత ఉంటుంది. వీరిలో ఎవరైనా విఫలమైనా, లేదా అందుబాటులో లేకపోయినా రాయల్స్ జట్టు డేంజర్ లో ఉండే ప్రమాదం ఉంది. ఇక్కడ భారత ఫైర్ బ్రాండ్ ఆటగాడు సంజు శాంసన్ తన సత్తా చూపాలి. కాకపోతే ఇప్పుడు అతడు నిలకడలేమితో సతమతమవుతున్నాడు. అండర్ -19 స్టార్ యశస్వి జైస్వాల్, సీనియర్ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప రూపంలో కొత్త చేర్పులు రాయల్స్ ఫ్రాంచైజీకి అతిపెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి

రాయల్స్  ముందుకు దూసుకెళ్లడానికి లెగ్-స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బలీయమైన ఆయుధంగా కనిపిస్తున్నాడు. ఐపీఎల్ లో మ్యాచ్ టర్న్ అవ్వడానికి ఒక్కరి ప్రదర్శన చాలు. దీంతో స్మిత్ టీమ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేం. 

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

కొత్త తరహా మోసం, హైదరాబాదీలూ తస్మాత్ జాగ్రత్త !