
ఐపీఎల్ 13వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 131/7 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(56), ఫించ్(32) రాణించగా.. మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు తీయగా.. నటరాజన్ రెండు, నదీమ్ ఒక వికెట్ తీశారు.