IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. యంగ్ ప్లేయర్స్ ప్రియమ్ గార్గ్(70; 45 బంతుల్లో 8×4, 3×6), అభిషేక్ శర్మ(47 నాటౌట్; 20 బంతుల్లో 3×4, 4×6) మెరుపులతో మొదట హైదరాబాద్ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై విఫలమైంది. హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆరంభంలోనే చెన్నై స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరారు. జడేజా(50), ధోని(47) చివర్లో మెరిసినా టార్గెట్‌ను అందుకోలేకపోయారు. 20 ఓవర్లకు 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్, సమద్ చెరో వికెట్ తీశారు.
That was a nail-biting game here in Dubai. @SunRisers win by 7 runs.#Dream11IPL #CSKvSRH pic.twitter.com/TFKp2Uz5kP
— IndianPremierLeague (@IPL) October 2, 2020