IPL 2020: గేల్ సునామీని ఢిల్లీ కట్టడి చేయగలదా.!

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా..

IPL 2020: గేల్ సునామీని ఢిల్లీ కట్టడి చేయగలదా.!

Updated on: Oct 20, 2020 | 1:01 PM

DC Vs KXIP: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇప్పటిదాకా టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఏడు మ్యాచుల్లో విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ జట్టు మూడు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. ఈ జట్టు లీగ్‌లో ఆడే ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాలి. అటు జోరు మీదున్న ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లాలని భావిస్తోంది.

అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఓపెనర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, అక్షర్ పటేల్‌‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. అటు బౌలింగ్‌‌లో రబడా, నోర్తజే ,అశ్విన్‌లు అదరగొడుతున్నారు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ విషయానికి వస్తే.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రాకతో ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింతగా బలంగా మారింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, దీపక్ హూడాలు బ్యాట్ ఝుళిపిస్తుండగా.. బౌలింగ్‌లో షమీ, అర్షదీప్ సింగ్, కాట్రేల్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌లు వికెట్లు పడగొడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకమేనని చెప్పాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us