తూర్పు మన్యంకు నిలిచిపోయిన రాకపోకలు

|

Aug 15, 2020 | 1:26 AM

అల్పపీడన ప్రభావంతో తూర్పు మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.

తూర్పు మన్యంకు నిలిచిపోయిన రాకపోకలు
Follow us on

అల్పపీడన ప్రభావంతో తూర్పు మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో లోతట్టు గ్రామాల్లోకి వరద ముంపు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దేవీపట్నం మండలంలోని 30గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం- కనకాయలంక కాజ్ వేపైకి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

గోదారమ్మ పరుగులు పెడుతుంది.. గడచిన నాలుగు రోజులుగా వరద నీరు క్రమేపీ పెరుగుతుంది. ఒక వైపు మారిన వాతావరణం, వరుసగా అల్పపీడన ద్రోణులు, వాయుగుండం కూడా జతకలియడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండడంతో గోదావరిలో వరద ఒక్కసారిగా ముంచు కొచ్చింది.