బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలి : ఆనంద్ మహీంద్ర

ఎంతో అర్థవంతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆలోచింపచేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర. ఇదే కోవలో తాజాగా అటల్ టన్నెల్ నిర్మాణ సంస్థను గూర్చి మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను మహీంద్ర అభినందనల్లో ముంచెత్తారు. వ్యక్తులకు మాత్రమే ఇస్తూ వస్తున్న భారతరత్న పురస్కారాన్ని సంస్థలకు కూడా ఇచ్చేట్టయితే బీఆర్ఓకు కూడా భారతరత్న ఇవ్వాలని ఆయన అన్నారు. సంస్థలకు భారతరత్న ఇస్తారో లేదో తనకు తెలియదని, కానీ ఎంతో […]

బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలి : ఆనంద్ మహీంద్ర

Updated on: Oct 03, 2020 | 6:45 PM

ఎంతో అర్థవంతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆలోచింపచేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర. ఇదే కోవలో తాజాగా అటల్ టన్నెల్ నిర్మాణ సంస్థను గూర్చి మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను మహీంద్ర అభినందనల్లో ముంచెత్తారు. వ్యక్తులకు మాత్రమే ఇస్తూ వస్తున్న భారతరత్న పురస్కారాన్ని సంస్థలకు కూడా ఇచ్చేట్టయితే బీఆర్ఓకు కూడా భారతరత్న ఇవ్వాలని ఆయన అన్నారు. సంస్థలకు భారతరత్న ఇస్తారో లేదో తనకు తెలియదని, కానీ ఎంతో తెగువ, కష్టించే స్వభావంతో సవాళ్లు విసిరే అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఎంతో సమర్థవంతంగా సొరంగాన్ని నిర్మించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. బీఆర్ఓ మాత్రం అందుకు అన్నివిధాలా అర్హమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ఓ సొరంగ మార్గం నిర్మించింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం. అటల్ టన్నెల్ పేరిట నామకరణం చేసిన ఈ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us