ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే డబ్బు ఖర్చు పెట్టడం గురించి కూడా ఆయన గొప్పగా తెలియజేయడం జరిగింది.
అనేక అంశాలు
చాలా మంది ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. మరి కొంత మంది ఎంత ఖర్చు పెట్టినా సరే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు.
డబ్బు ఖర్చులు
దీనికి కారణం ఖర్చు పెట్టే విధానమే అంటున్నాడు చాణక్యుడు. కాగా, ఎలా ఖర్చు పెడితే, అప్పుల బాధలు ఎక్కువ అవుతాయో ఇప్పుడు మనం చూసేద్దాం.
ఖర్చు పెట్టే విధానం
చాలా మంది ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అందువలన ఎప్పుడూ కూడా ఇతరులను చూసి ఆడంబరాలకు వెళ్లి ఖర్చు చేయడం మంచిదికాదంట.
ఆడంబరాలకు
అంతే కాకుండా కొంత మంది మన చుట్టూ ఉండే వ్యక్తులు ఏమాత్రం పనికి రారు అని తెలిసి కూడా వారి కోసం ఖర్చు చేస్తారు ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నాడు చాణక్యుడు.
పనికి రాని వ్యక్తులు
కొంత మంది పది మందిలో గొప్పగా అనిపించుకోవడం కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం ఖర్చు చేస్తుంటారు, అది కూడా మంచిది కాదంట.
గొప్పల కోసం
అంతే కాకుండా డిస్కౌంట్ ఉందని ఎక్కువ కొనడం కూడా మిమ్మల్ని అప్పుల్లోకి తోసేస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.