ఒడిశాలో ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం.. వరల్డ్ కప్ టోర్నీకి వేదికగా మారనున్న భువనేశ్వర్​

ఒడిశాలో ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం.. వరల్డ్ కప్ టోర్నీకి వేదికగా మారనున్న భువనేశ్వర్​

డియం భారత్​లోనే పెద్ద హాకీ స్టేడియంగా నిలవబోతోందని డిశా ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహోపాత్ర వెల్లడించారు. బీపీటీయూ క్యాంపస్​లో దీనిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని..

Sanjay Kasula

|

Jan 20, 2021 | 6:42 AM

Largest Hockey Stadium : ప్రపంచ స్థాయి హాకీ స్టేడియాన్ని ఒడిశాలో నిర్మించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.  20 వేల సీటింగ్​ సామర్థ్యంతో దేశంలో ఇది అతిపెద్ద హాకీ స్టేడియంగా అవతరించనుంది.

రూర్కెలాలోని బిజు పట్నాయక్ సాంకేతిక విశ్వవిద్యాలయ క్యాంపస్​లో ఈ స్టేడియాన్ని నిర్మస్తున్నారు. 2023లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్​నకు ఇది రెండో వేదికగా మారనుంది. వరల్డ్ కప్ టోర్నీని భువనేశ్వర్​లోనూ నిర్వహించనున్నారు.

ఈ స్టేడియం భారత్​లోనే పెద్ద హాకీ స్టేడియంగా నిలవబోతోందని డిశా ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహోపాత్ర వెల్లడించారు. బీపీటీయూ క్యాంపస్​లో దీనిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని.. ఏడాదిలోగా పూర్తవుతాయని తెలిపారు .

పార్కింగ్ సహా ఇతర సదుపాయాల కల్పనకు కూడా పనులు అప్పుడే ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు. 15 ఎకరాల్లో 20 వేల సీటింగ్​ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Sania Mirza Corona Positive : సానియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu