Indian buffalo racer: ఇండియన్ ఉసేన్ బోల్ట్‌కు ఊహించని ఆఫర్…

|

Feb 15, 2020 | 8:27 PM

Indian buffalo racer:  కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. ఇటీవల కంబాళా రేసింగ్ ఈవెంట్‌లో రికార్డ్ బద్దలు కొట్టిన తర్వాత ‘టాప్’ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌లను కలిసే అవకాశం లభించింది. దక్షిణ కర్ణాటకలో ప్రతి ఏడాది కంబళ అనే సాంప్రదాయ పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తూ…వాటి వెనుక యజమాని  కూడా పరుగెడతాడు.ఈ క్రీడలో వేగంగా పరుగులు తీసిన రికార్డును బద్దలు కొట్టి శ్రీనివాస్ […]

Indian buffalo racer: ఇండియన్ ఉసేన్ బోల్ట్‌కు ఊహించని ఆఫర్...
Follow us on

Indian buffalo racer:  కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. ఇటీవల కంబాళా రేసింగ్ ఈవెంట్‌లో రికార్డ్ బద్దలు కొట్టిన తర్వాత ‘టాప్’ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌లను కలిసే అవకాశం లభించింది. దక్షిణ కర్ణాటకలో ప్రతి ఏడాది కంబళ అనే సాంప్రదాయ పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తూ…వాటి వెనుక యజమాని  కూడా పరుగెడతాడు.ఈ క్రీడలో వేగంగా పరుగులు తీసిన రికార్డును బద్దలు కొట్టి శ్రీనివాస్ గౌడ ఖ్యాతి గడించాడు. శ్రీనివాస్ గౌడ 142 మీ రేసును కేవలం 13.42 సెకన్లలో పూర్తి చేసి  కొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్ తర్వాత పార్ట్‌టైమ్ భవన నిర్మాణ కార్మికుడైన శ్రీనివాస్ గౌడను సోషల్ మీడియాలో ఉసేన్ బోల్ట్‌తో పోల్చుతున్నారు. తాజా లెక్కల ప్రకారం 9.55 సెకన్లలో శ్రీనివాస్ 100 మీ రేసును పూర్తి చేసి ఉంటారని ఓ అంచనా. ఇది ఉసేన్ బోల్ట్ యొక్క 100 మీ ప్రపంచ రికార్డు వేగం కంటే 0.03 సెకన్లు ఎక్కువ.

ఇది కూడా చదవండి :ఆధార్‌తో లింకు కాకుంటే పాన్‌కార్డు కట్‌..

కాగా శ్రీనివాస గౌడ గొప్పతనం సోషల్ మీడియా ద్వారా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిరిజు దృష్టికి వెళ్లింది. అతనికి అథ్లెటిక్స్ కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. “నేను శ్రీనివాస గౌడను ఉన్నత SAI కోచ్‌ల ద్వారా ట్రయల్స్ కోసం పిలుస్తాను. ఒలింపిక్స్ యొక్క ప్రమాణాల గురించి మాములు ప్రజలకు అవగాహన ఉండదు. అందుకు శారీరక ధృడత్వం, సహనం చాలా అవసరం.  భారతదేశంలో ప్రతిభ ఉన్నవారిని ఎవరినీ గుర్తించకుండా ఉండం” అని కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు. 

మంత్రి ఆదేశాల ప్రకారం బెంగుళూరు శాయ్ కేంద్రానికి శ్రీనివాస గౌడను తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అతడి అడ్రస్ కనుగొన్నామని..బెంగుళూరు తీసుకురావడానికి రైలు టికెట్లు కూడా బుక్ చేశామని శాయ్ ట్విట్టర్‌లో తెలిపింది.