India vs Australia: అతడికే మళ్లీ చిక్కిన హిట్‌మ్యాన్‌.. ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు.. అతడి ఖాతాలో రికార్డ్

ఆసిస్‌లో జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో ఒకే బౌలర్‌కు ఆరుసార్లు చిక్కాడు రోహిత్.

India vs Australia: అతడికే మళ్లీ చిక్కిన హిట్‌మ్యాన్‌.. ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు.. అతడి ఖాతాలో రికార్డ్

Updated on: Jan 16, 2021 | 3:06 PM

India vs Australia: ఆసిస్‌లో జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో ఒకే బౌలర్‌కు ఆరుసార్లు చిక్కాడు రోహిత్. గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు హిట్‌మ్యాన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మూడు టెస్టు(సిడ్ని టెస్టు) లో బరిలోకి దిగి (26, 52) పరుగులు చేశాడు. తాజాగా గబ్బాలో జరుగుతోన్న నాలుగో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే  టెస్టు ఫార్మాట్‌లో అత్యధికంగా ఆరుసార్లు లైయన్‌ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు రోహిత్. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా పేసర్‌ రబాడతో సమానంగా లైయన్‌ ఐదుసార్లు రోహిత్​ను ఔట్ చేశాడు. దీంతో హిట్‌మ్యాన్‌ను  టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు దక్కించుకున్నాడు. మరోవైపు లైయన్‌ ఈ మ్యాచ్‌లో ఇంకో మూడు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా తరఫున 400 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా హిస్టరీ క్రియేట్ చేస్తాడు. అతడికన్నా ముందు షేన్‌వార్న్‌(708), మెక్‌గ్రాత్‌(563) ఈ ఫీట్ అందుకున్నారు.
Also Read:
Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..
Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి.. సంచలన విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు!