
David Warner Return: రెండో టెస్టు ఓటమితో డీలాపడిన ఆసీస్ జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మళ్లీ తిరిగి జట్టులోకి చేరాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు తుది జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన జో బర్న్స్‌ను తప్పించగా.. సీన్ అబాట్, డేవిడ్ వార్నర్, విల్ పుకోస్కీలు జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7ణ ప్రారంభం కానుంది.
ఆసీస్ జట్టు:
టిమ్ పైన్(కెప్టెన్), పాట్ కమిన్స్, సీన్ అబాట్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ హ్యారీస్, ట్రావిస్ హెడ్, హెన్రిక్స్, లబుషేన్, నాథన్ లైయన్, మైఖేల్ నాజర్, జేమ్స్ పాటిన్సన్, విల్ పుకోస్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్