India Vs Australia 2020: హద్దు మీరిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.. జరిమానా విధించిన ఐసీసీ..

India Vs Australia 2020: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో అతడు నిబంధనలను..

  • Ravi Kiran
  • Publish Date - 9:07 am, Mon, 11 January 21
India Vs Australia 2020: హద్దు మీరిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.. జరిమానా విధించిన ఐసీసీ..

India Vs Australia 2020: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో అతడు నిబంధనలను ఉల్లంఘించి హద్దుమీరడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మూడో రోజు ఆటలో పుజారాను ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అంతేకాకుండా రివ్యూ కూడా వర్కౌట్ కాలేదు. దీనితో పైన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అభ్యంతరకర కామెంట్ చేశాడు. దీనికి ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు… ఓ డీమెరిట్ పాయింట్‌ను కలిపింది.