యావత్ దేశానికీ ఒకే రాజధానా.? భారతదేశానికి కచ్చితంగా 4 క్యాపిటల్స్ ఉండాలి : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ

భారతదేశానికి ఒకే రాజధాని ఉండటమేమిటని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలదీశారు. సువిశాల భారతావనికి 4 రాజధానులు..

  • Venkata Narayana
  • Publish Date - 3:19 pm, Sat, 23 January 21
యావత్ దేశానికీ ఒకే రాజధానా.? భారతదేశానికి కచ్చితంగా 4 క్యాపిటల్స్ ఉండాలి : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ

భారతదేశానికి ఒకే రాజధాని ఉండటమేమిటని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలదీశారు. సువిశాల భారతావనికి 4 రాజధానులు కచ్చింతంగా ఉండాల్సిదేనని ఆమె చెప్పారు. నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కోల్‌కతా నుంచి యావద్దేశాన్ని ఆంగ్లమే ఏలుతోందని, అలాంటప్పుడు దేశంలో ఒక్క రాజధాని నగరమే ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు. నేతాజీ 125వ జయంత్యుత్సవాన్ని ‘దేశ్ నాయక్ దివస్’గా ఈరోజు జరుపుకొంటున్నామని ప్రకటించిన ఆమె, నేతాజీని ‘దేశ్‌నాయక్’గా రబీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారని, ఈ ‘పరాక్రమ్’ ఎక్కడదని ఆమె ప్రశ్నించారు. బెంగాల్‌లో అజాద్ హింద్ స్మారకం అద్భుతంగా నిర్మించుకుందామని ఆమె తెలిపారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని నేతాజీ స్థాపించినప్పుడు, గుజరాత్, బెంగాల్, తమిళనాడు ప్రజలతో సహా ప్రతి ఒక్కరిని అందులోకి తీసుకున్నారని మమతా బెనర్జీ తెలిపారు. బ్రిటిషర్ల విభజించు – పాలించు విధానానికి వ్యతిరేకంగా నేతాజీ పోరాటం సాగించారని మమత స్పష్టం చేశారు.