దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు

|

Oct 22, 2020 | 10:50 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాాగుతోంది. కొత్తగా 55,838 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 77,06,946కు చేరింది.

దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాాగుతోంది. కొత్తగా 55,838 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 77,06,946కు చేరింది. మరో 702 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం మరణాల సంఖ్య 1,16,616 కు చేరింది. తాజాగా 79,415 మంది మహమ్మారిని జయించగా… ఇప్పటివరకు వ్యాధి బారి నుంచి 68,74,518  మంది కోలుకున్నారు. దేశంలో రికవరీల సంఖ్య భారీగా పెరగడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం దేశంలో 7,15,812 యాక్టీవ్ కేసులున్నాయి.  ఒక్కరోజులో 14,69,984 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

 దాదాపు 88.81 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో కేవలం 9.67 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు  వెల్లడించింది. డెత్ రేటు 1.51 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది.