India Corona Cases: దేశంలో కొత్తగా 18,645 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

దేశంలో కరోనా కేసులు తీవ్రత క్రమక్రమంగా తగ్గుతుంది. కొత్తగా 18,645 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,50,284కు చేరింది. 

India Corona Cases: దేశంలో కొత్తగా 18,645 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Corona-Virus-India

Updated on: Jan 10, 2021 | 10:32 AM

India Corona Cases: దేశంలో కరోనా కేసులు తీవ్రత క్రమక్రమంగా తగ్గుతుంది. కొత్తగా 18,645 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,50,284కు చేరింది. మరో 201మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,50,999కు చేరింది. తాజాగా 19,299మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,00,75,950 చేరింది.  ప్రస్తుతం దేశంలో 2,23,335 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. శనివారం ఒకే రోజు 8,43,307 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇప్పటి వరకు 18,10,96,622 శాంపిల్స్ పరిశీలించినట్లు పేర్కొంది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Also Read:

Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి

Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా