నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. దక్షిణ తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు..!

|

Nov 26, 2020 | 4:34 PM

నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా తరలుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. దక్షిణ తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు..!
Follow us on

నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా తరలుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ఫలితంగా తెలంగాణాలోనూ ఓ మోస్తారు వర్షాలు కురుయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నివర్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇక, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం మేఘామృతమై ఉండటం కారణంగా అక్కడక్క ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.