ICC World Test Championship: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియాకు కివీస్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడం.. అంతేకాక బ్యాటింగ్, బౌలింగ్‌లలో వైఫల్యాలు భారత్‌ను ఈ సిరీస్‌లో బాగా దెబ్బ తీశాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో దాదాపు ఫైనల్‌లో ప్లేస్ సంపాదించుకున్న భారత్.. మున్ముందు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోతే.. ఫైనల్ స్థానం చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తదుపరి మ్యాచ్‌లు ఇలా ఉన్నాయి…
ఇండియా టూర్ అఫ్ ఆస్ట్రేలియా( బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) 2020-21:
ఇప్పటికే రెండు జట్లూ దాదాపు సమానమైన పాయింట్లతో పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా.. ఈ సిరీస్‌తో ఎవరు అగ్రస్థానాన్ని సంపాదించుకుంటారన్న దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబూషన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉండటంతో భారత్‌కు ఈ సిరీస్ కఠినతరమని చెప్పాలి. కాగా, ఈ సిరీస్ షెడ్యూల్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
ఇంగ్లాండ్ టూర్ అఫ్ ఇండియా(2021):
వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. స్వదేశీ పిచ్‌లు కాబట్టి కోహ్లీసేనకు సులభతరమైన అంశమే ఇది. కానీ ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక అంతకముందు ఇంగ్లాండ్ పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లతో తలబడాలి. ఆ రెండు సిరీస్‌లలోనూ కావాల్సిన పాయింట్లు దక్కించుకుంటే.. ఇండియా సిరీస్‌లో తక్కువ మ్యాచ్‌లు నెగ్గినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాగా, ఇంగ్లాండ్, భారత్ సిరీస్‌తోనే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనలిస్టులను ఖరారు చేస్తారు. ఇక ఫైనల్ లార్డ్స్ వేదికగా జరగనుంది.
For More News:
హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!
రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!
అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!
కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్
మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?
మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?
మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!