టెస్ట్ ఛాంపియన్ షిప్: ఆసీస్ సంచలనానికే అగ్రస్థానం..

టెస్ట్ ఛాంపియన్ షిప్: ఆసీస్ సంచలనానికే అగ్రస్థానం..

ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల లిస్టును ఐసీసీ ఇటీవల ప్రకటించింది. ఇందులో పలువురు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Ravi Kiran

|

Aug 12, 2020 | 9:47 PM

ICC Test Championship: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల లిస్టును ఐసీసీ ఇటీవల ప్రకటించింది. ఇందులో పలువురు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆసీస్ యువ సంచలనం మార్నాస్ లబుషేన్(1249) రన్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. బెన్ స్టోక్స్(1,131 ENG), స్టీవ్ స్మిత్(1,028 AUS), డేవిడ్ వార్నర్(881 AUS), జో రూట్(828 ENG)లు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు.

ఇక అందరూ ఊహించని విధంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పదో స్థానంలో నిలవడం గమనార్హం. ఆరో స్థానంలో మయాంక్ అగర్వాల్(779 IND), ఆ తర్వాత రోరీ బర్న్స్(731 ENG), అజింక్యా రహనే(715 IND), బాబర్ ఆజామ్(689 PAK), విరాట్ కోహ్లీ(627 IND)లు వరుసగా లిస్టులో ఉన్నారు. ఇక జట్టుల పరంగా చూసుకుంటే భారత్ అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu