కరోనా ఎఫెక్ట్.. లంక ప్రీమియర్ లీగ్ వాయిదా…

కరోనా ఎఫెక్ట్ కారణంగా శ్రీలంక క్రికెట్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నీ నవంబర్ నెలకు వాయిదా పడింది.

కరోనా ఎఫెక్ట్.. లంక ప్రీమియర్ లీగ్ వాయిదా...
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2020 | 9:39 PM

Lanka Premier League Postponed: కరోనా ఎఫెక్ట్ కారణంగా శ్రీలంక క్రికెట్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ టీ 20 టోర్నీ నవంబర్ నెలకు వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ జరగాల్సి ఉంది. ఈ లీగ్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు కొలంబో, క్యాండీ, గాలె, దంబుల్లా, జాఫ్నా వేదికలుగా జరగనున్నాయి.

విదేశీ ఆటగాళ్లు కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి కాబట్టి.. ఈ నెలలో టోర్నీని నిర్వహించడం సాధ్యపడదు. అందుకే లంక ప్రీమియర్ లీగ్‌ను నవంబర్‌కు వాయిదా వేశామని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా తెలిపారు. ఐపీఎల్ ముగిశాక నవంబర్ రెండో వారంలో లంక ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు.