ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-2లో కోహ్లీ, రోహిత్ శర్మ

|

Sep 17, 2020 | 6:01 PM

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం వన్డే ర్యాంకింగ్స్‌ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ టాప్ క్రికెటర్ల ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-2లో కోహ్లీ, రోహిత్ శర్మ
Follow us on

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం వన్డే ర్యాంకింగ్స్‌ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ టాప్ క్రికెటర్ల ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్నాడు. కోహ్లీ 871 పాయింట్లతో తిరుగులేని స్థితిలో ఉండగా..టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (855), బాబర్‌ అజామ్‌(829) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన ఓపెనర్‌ బెయిర్‌ స్టో టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌తో ఆఖరిదైన మూడో వన్డేలో బెయిర్‌స్టో అద్భుతమైన సెంచరీతో రాణించి రేటింగ్‌ పాయింట్లు అమాంతం పెంచుకున్నాడు. 30 ఏండ్ల యార్క్‌షైర్‌ ఆటగాడు 2018 అక్టోబర్‌లో తొలిసారి తొమ్మిదో ర్యాంకు సాధించాడు.

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే.. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ నంబర్‌వన్‌ స్థానంలో నిలువగా, టీమిండియా స్పీడ్‌స్టర్‌ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా, అఫ్గనిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ 301 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.