నేనూ వ్యాక్సిన్ తీసుకున్నా. హెల్త్ ఫైన్ , ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఆందోళన అనవసరమని సూచన

| Edited By: Anil kumar poka

Jan 18, 2021 | 7:21 PM

తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నానని, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.

నేనూ వ్యాక్సిన్ తీసుకున్నా. హెల్త్ ఫైన్ , ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఆందోళన అనవసరమని సూచన
Follow us on

తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నానని, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఈ నెల 16 న తాను టీకామందు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఐ యాం ఫైన్,, నా హెల్త్ చక్కగా ఉంది.. ఈ రోజంతా యధావిధిగా విధులకు హాజరయ్యా అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం 10 శాతం మందిలో మాత్రమే స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు అన్నారు. దేశంలో కోవిడ్ మరణాలు తగ్గించాలంటే ప్రతివారూ టీకామందు తీసుకోవాలి అని ఆయన సూచించారు. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలర్జీ వస్తుందన్న వార్తలపై స్పందించిన ఆయన.. ఏ మందు అయినా ఎలర్జీకి కారణమవుతుందన్నారు. ఉదాహరణకు సాధారణ క్రోసిన్, లేదా పారాసిటమాల్ తీసుకున్నా ఒక్కోసారి ఎలర్జీ కలుగుతుందన్నారు. ర్యాషెస్,  శ్వాస సరిగా ఆడకపోవడం వంటి రుగ్మతలు వఛ్చినా తగిన చికిత్సలు తీసుకుంటే సరిపోతుందని రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఇండియాలో వ్యాక్సిన్ కారణంగా మరణాలేవీ సంభవించలేదని ఆయన వివరించారు.

కాగా ఒక డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడానికి 28 రోజుల వ్యవధి ఉండాలని ఆయన చెప్పారు. టీకామందులపై అపోహలను, అనుమానాలను ప్రజలు విడనాడాలని ఆయన కోరారు.