జలమండలి ‘బంపర్ ఆఫర్’

హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా పెండింగ్ బిల్లులను చెల్లించే వారికి పూర్తిస్థాయిలో వడ్డీ రాయితీ కల్పిస్తోంది....

జలమండలి బంపర్ ఆఫర్

Updated on: Aug 19, 2020 | 8:55 PM

హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా పెండింగ్ బిల్లులను చెల్లించే వారికి పూర్తిస్థాయిలో వడ్డీ రాయితీ కల్పిస్తోంది. ఈ ఆఫర్ వచ్చే నెల 15వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు జలమండలి ఎండీ దాన కిషోర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో కస్టమర్‌ కేర్ సెంటర్‌ను దాన కిషోర్ ప్రారంభించారు. దాన కిషోర్ మాట్లాడుతూ … వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ పథకంలో ఏమైనా అనుమానాలు ఉంటే కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని, వారి సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారని అన్నారు. అలాగే వన్ టైమ్ సెటిల్‌మెంట్ గురించి వాట్సాప్ చాట్ బోట్ ఆటోమేటిక్ రెస్పాన్స్ అకౌంట్‌ను ఏర్పాటు చేశామని దాన కిషోర్ వెల్లడించారు.

వినియోగదారులు ఏ మొబైల్ నంబర్ నుంచైనా 9154170968 నంబర్‌కి HI అని మేసేజ్ పంపండం ద్వారా వారికి సంబంధించిన బకాయి బిల్లులు, వడ్డీ రాయితీ, ఎక్కడ, ఎలా చెల్లించాలో అనే వివరాలన్నింటినీ ఆటోమెటిక్‌గా తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ ఆఫర్ ను నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Follow Us