ఆ బంధానికి విలువ పెంచే వినూత్న ప్రయోగం.. ఒకరినొకరు కలుసుకునేందుకు హగ్ టెంట్లు..!

|

Feb 05, 2021 | 8:54 PM

అర్థం చేసుకునే గుణం, ఓర్పు, ఒకరి మాటను మరొకరు గౌరవించే అలవాటు చేసుకోవడం వల్ల కాపురాలు నిండు నూరేళ్లు ఉంటాయంటారు.

ఆ బంధానికి విలువ పెంచే వినూత్న ప్రయోగం.. ఒకరినొకరు కలుసుకునేందుకు హగ్ టెంట్లు..!
Follow us on

 ‘Hug tent’ at Colorado : మానవ సంబంధాల్లోకెల్లా భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు.. ఒకరి కోసం మరొకరు జీవితాంతం తోడుండే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఇప్పటి ఆధునిక సమాజంలో వివాహ బంధానికి విలువ తగ్గుతుందేమోననే భావన వస్తుంటుంది. అయితే అర్థం చేసుకునే గుణం, ఓర్పు, ఒకరి మాటను మరొకరు గౌరవించే అలవాటు చేసుకోవడం వల్ల కాపురాలు నిండు నూరేళ్లు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వారు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కాసింత ఎడబాటుకు గురైతే తట్టుకోలేరు. అలానే డెబ్బై ఏళ్ల పాటు కాపురం చేసిన ఆలూమగలు కొన్ని రోజులు దూరంగా ఉంటే ఎలా ఉంటుందో.. కలిసినప్పుడు వారి ఆవేదనతో కూడిన ఆనందం ఎలా ఉంటుందో ఈ బ్రిటన్ జంటలను చూస్తే తెలుస్తుంది.

బ్రిటన్‌లోని డెన్వర్ శివారు లూయిస్ విల్ల ప్రాంతానికి చెందిన బామ్మ, తాతయ్యకు పెళ్లై 50 ఏళ్లు అయింది. లిండా హార్ట్‌మన్(75), తన 77 ఏళ్ల భర్త లెన్ హార్ట్‌మన్‌ కరోనా కారణంగా ఎనిమిది నెలల పాటు ఎడబాటుగా ఉన్నారు. అసబర్బన్ డెన్వర్‌లోని సహాయక జీవన కేంద్రంలో ఆమె చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు కేవలం ఫోన్లలో మాట్లాడుకోవడమే కానీ దాదాపు పాటు కలుసుకోలేని పరిస్థితి.

ఇలాంటి సమయంలో ఆరోగ్య సంరక్షణ సంస్థ టీఆర్‌యూ కమ్యూనిటీ కేర్‌ భాగస్వామ్యంతో కల్పించిన మంచి అవకాశం ఆ జంటలో తెలియని ఆనందం వెల్లువిరిసింది. ఇప్పటి వరకు ఇన్ని రోజులు విడిగా ఉండలేదని ఆ వృద్ధ దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. రెండు వెన్నుపూసల కోల్పోయిన హార్ట్‌మన్, ఇకపై తన భర్తను స్వయంగా చూసుకోలేనని వేదనకు గురైంది. అతన్ని మనస్ఫుర్తిగా కలుసుకోలేనని మదనపడింది. మళ్ళీ భర్తను ఆలింగనం చేసుకోలేనేమోనని బాధకు గురైంది. “హగ్ టెంట్” ఏర్పాటుతో ఇద్దరు కలుసుకుని తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ హగ్ టెంట్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలావుంటే, అనారోగ్యంతో కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నవారిని గురించి వారి కుటుంబసభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న లాభాపేక్షలేని ఆరోగ్య సంరక్షణ సంస్థ టీఆర్‌యూ కమ్యూనిటీ కేర్‌ భాగస్వామ్యంతో వృద్ధ దంపతులు కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం లూయిస్ విల్లెలోని జునిపెర్ విలేజ్ వెలుపల ఏర్పాటు చేసిన “హగ్ టెంట్” ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో ప్లాస్టిక్‌తో ఒక గుడారాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కలుసుకోలేము అనుకున్న వృద్ధ దంపతులను ఒకచోటికి చేర్చారు. ఇలా నాలుగు ప్రధాన కేంద్రాల్లో ఏర్పాట్లు చేసిన కుటుంబసభ్యుల అభినందనుల అందుకుంది టఆర్‌‌యూ సంస్థ.

ఇందులో భాగంగా గ్రెగ్ మెక్‌డొనాల్డ్ తన 84 ఏళ్ల తన తల్లిని ఇలానే కలుసుకోగలిగింది. మెక్‌డొనాల్డ్‌తో చేతులు పట్టుకోవడం చాలా సంతోషనిచ్చిందని ఆమె తల్లి చెప్పింది. ఎందుకంటే గత ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు ఆమె స్పర్శను తాకలేదు. ఆమె మనవడు, మనవరాలు కూడా ఆ బామ్మను కలుసుకుని బావోద్వేగానికి లోనయ్యారు. “సమయం విలువైంది. మనమందరం మరింత సాధారణ స్థితికి రావడానికి మరికొంతకాలం వేచి ఉండాలి. ఈ సమయంలో, ప్రతి ఒక్కరూ వారు చేయగలిగినది చేస్తున్నారు” అని గ్రెగ్ మక్డోనాల్డ్ చెప్పారు. ప్రతిఒక్కరితో కలుసుకునేందుకు ఆరోగ్య సంరక్షణ సంస్థ టీఆర్‌యూ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను గ్రెగ్ మెక్‌డొనాల్డ్ అభినందించారు.

టీఆర్‌యూ కమ్యూనిటీ కేర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అమండా మీర్ మాట్లాడుతూ… కొంతమంది వాలంటీర్లు పాపప్ ఫ్రేమ్ చుట్టూ హగ్ టెంట్ నిర్మించామన్నారు. నవంబర్ ప్రారంభం నుండి, కొలరాడోలో నాలుగు హగ్ గుడారాలను ఏర్పాటు చేసి కరోనా కారణంగా కలుసుకునేవారికి సహాయపడుతున్నామన్నారు. ఇలా కలుసుకోవడం ద్వారా వారి ముఖాల్లో మీరు ఒక విధమైన ఉపశమనాన్ని చూడవచ్చన్న ఆమె, ఇది నిజంగా ప్రాథమిక మానవ అవసరమన్నారు. ఈ సదుపాయాలలో, వారు తమ కుటుంబాలతో లేనందున చాలా సార్లు వారు సంతోషాన్ని కోల్పోతున్నారన్నారు మీర్ . ఇలా కలుసుకోవడం ద్వారా వారి కుటంబాల్లో కొలవలేని సంతోషంతో పాటు గొప్ప అనుభూతి పొందగలిగారని మీర్ తెలిపారు.

Read Also…  అరుదైన ఘనత సాధించిన కీర్తిసురేశ్.. ‘ఫోర్బ్స్’ ఇండియా 2021లో చోటు దక్కించుకున్న ‘మహానటి’..