కరోనా వైరస్ భయం, హాంకాంగ్ లో 10 వేలమందికి తప్పనిసరి కోవిడ్ టెస్టింగ్, ఇదే మొదటి సారి, జోర్దాన్ వాసుల వల్లేనా ?

హాంకాంగ్ లోని కోలూన్ ప్రాంతాన్ని ప్రభుత్వం దిగ్బంధం చేసింది. ఇక్కడ లాక్ డౌన్ విధించింది. . కోవిడ్ ఔట్ బ్రేక్ కారణంగా 10 వేలమందికి..,

కరోనా వైరస్ భయం, హాంకాంగ్ లో 10 వేలమందికి తప్పనిసరి కోవిడ్ టెస్టింగ్, ఇదే మొదటి సారి, జోర్దాన్ వాసుల వల్లేనా ?
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jan 23, 2021 | 4:45 PM

హాంకాంగ్ లోని కోలూన్ ప్రాంతాన్ని ప్రభుత్వం దిగ్బంధం చేసింది. ఇక్కడ లాక్ డౌన్ విధించింది. . కోవిడ్ ఔట్ బ్రేక్ కారణంగా 10 వేలమందికి తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్మయించింది. అప్పటివరకు వీరంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించినట్టు హాంకాంగ్ లీడర్ క్యారీ లామ్ తెలిపారు. లాక్ డౌన్ అమలవుతున్న ఈ ప్రాంతంలో 70 కి పైగా ఇళ్ళు, బిల్డింగులు ఉన్నాయి. సుమారు 48 గంటల్లోగా పది వేలమందికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్యారీ లామ్ చెప్పారు. ఇందుకు 50 తాత్కాలిక టెస్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని, మూడు వేలమంది సిబ్బంది వీరికి టెస్టులు నిర్వహిస్తారని ఆమె వివరించారు. పొరుగునున్న జోర్దాన్ నుంచి అనేక మంది ప్రజలు హాంకాంగ్ లోని కోలూన్ ప్రాంతానికి చేరుకుంటుంటారు. దీంతో కోవిడ్ వ్యాపించి ఉండవచ్ఛునని  భావిస్తున్నారు. ఈ నెలలో ఈ నగరంలో 162 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 81 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసుల సంఖ్య 10,010 కి పెరిగింది. 160 మందికి పైగా మృతి చెందారు. Read Also:తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు.. Read Also :గాంధీలో సాధారణ సేవలు పునఃప్రారంభంపై ఉత్తర్వులు… ఈనెల 21 నుంచి అందుబాటులోకి అన్ని రకాల సేవలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu