వరద ప్రభావిత ప్రాంతాల్లో అమిత్ షా ఏరియల్ సర్వే

కర్ణాటకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం యూడియూరప్పతో కలిసి అమిత్‌ షా బెల్గామి జిల్లాల్లో పర్యటించారు. రాష్ట్రంలో వరదలతో జనజీవనం స్తంభించింది. బగల్‌ కోట్‌, రాయచూర్, బెల్గామ్, కలబుర్గి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే రిస్క్యూ టీంలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఏరియల్‌ సర్వే అనంతరం వరద భీభత్సం, చర్యలపై అధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు యుద్దప్రాతిపదిక […]

వరద ప్రభావిత ప్రాంతాల్లో అమిత్ షా ఏరియల్ సర్వే

Edited By:

Updated on: Aug 12, 2019 | 6:57 AM

కర్ణాటకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం యూడియూరప్పతో కలిసి అమిత్‌ షా బెల్గామి జిల్లాల్లో పర్యటించారు. రాష్ట్రంలో వరదలతో జనజీవనం స్తంభించింది. బగల్‌ కోట్‌, రాయచూర్, బెల్గామ్, కలబుర్గి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే రిస్క్యూ టీంలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఏరియల్‌ సర్వే అనంతరం వరద భీభత్సం, చర్యలపై అధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు యుద్దప్రాతిపదిక కొనసాగించాలన్న అమిత్‌ షా, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.