సుశాంత్ 2020 డ్రీమ్స్ లిస్ట్.. ఏమి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

సుశాంత్ 2020 డ్రీమ్స్ లిస్ట్.. ఏమి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

సుశాంత్ డైరీలోని కొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. 2020లో చేయాలనుకున్న ప్లాన్స్‌ను సుశాంత్ ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఈ సంవత్సరంలో పలు సంచలనాలకు నాంది పలకాలనుకున్నాడు.

Ravi Kiran

|

Aug 14, 2020 | 1:20 AM

Sushant Singh Rajput’s plan for 2020: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం వల్లే అతడు మరణించడానికి కొందరు ఆరోపిస్తుంటే.. డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడని మరికొందరు అంటున్నారు. ఇక సుశాంత్ చావుకు రియానే కారణమని ఇంకొందరి ఆరోపణ. ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ డైరీలోని కొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. 2020లో చేయాలనుకున్న ప్లాన్స్‌ను సుశాంత్ ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఈ సంవత్సరంలో పలు సంచలనాలకు నాంది పలకాలనుకున్నాడు. గతేడాది తాను నెరవేర్చుకోవాల్సిన కలలను ఎలా డైరీలో రాసుకున్నాడో.. అలాగే ఈ ఏడాది కూడా కొన్ని డ్రీమ్స్ పూర్తి చేయాలని ఆశించాడు.

”హాలీవుడ్ అరంగేట్రం, కంటెంట్ క్రియేటర్ టీమ్, సొంతంగా నిర్మాణ సంస్థతో పాటు ఎఫ్టీఐఐ విద్యార్థులతో కలిసి పని చేయడం వంటివి ఈ ఏడాది తాను నెరవేర్చుకోవాల్సిన డ్రీమ్స్” అని సుశాంత్ తన డైరీలో రాసుకున్నాడు. అయితే ఈ కలలను పూర్తి చేయకుండానే అతడు పరలోకాలకు వెళ్ళిపోయాడు. కాగా, జూన్ 14న సుశాంత్ తన అపార్ట్మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక గత నెలలో అతడి తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో సహా మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu