ప్రముఖ‌ నటి హిమానీ శివ‌పురికి కరోనా

కరోనా మహమ్మారి సామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్నీ వదలడం  లేదు . తాజాగా బాలీవుడ్‌ పరిశ్రమలో అనేక సినిమాలతో ఆకట్టుకున్న హిమానీ శివ‌పురికి కరోనా సోకింది.

ప్రముఖ‌ నటి హిమానీ శివ‌పురికి కరోనా

Updated on: Sep 12, 2020 | 10:44 PM

కరోనా మహమ్మారి సామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్నీ వదలడం  లేదు . తాజాగా బాలీవుడ్‌ పరిశ్రమలో అనేక సినిమాలతో ఆకట్టుకున్న హిమానీ శివ‌పురికి కరోనా సోకింది. తనకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.  హిమానీ  ‘ఘ‌ర్ ఏక్ స‌ప్నా’ వంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల ద్వారా ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు.

అదే విధంగా ‘హ‌మ్ ఆప్కే హై కౌన్’, ‘దిల్వాలే దుల్హానియా లే జ‌యేంగే’, ‘పార్డెస్’ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే కుచ్ కుచ్ హోతా హైలో రిఫాత్ బీ పాత్ర‌కు ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. కేవలం సినిమాలలోనే కాక టెలివిజన్ రంగంలో కూడా హిమానీ శివ‌పురి మంచి పేరు తెచ్చుకున్నారు.

 

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

విచిత్ర కప్ప, పొట్టలో నుంచి వెలుగు

Loading...
Unable to load recommendations.
Follow Us