త‌న ల‌వ్ స్టోరీల‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ప్రియా ఆనంద్‌

త‌న ల‌వ్ స్టోరీల‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ప్రియా ఆనంద్‌

త‌న ల‌వ్ స్టోరీల‌పై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ ప్రియా ఆనంద్. ద‌గ్గుబాటి రానా న‌టించిన 'లీడ‌ర్' సినిమాలో న‌టించిన‌ ప్రియా ఆనంద్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. లీడ‌ర్ చిత్రం త‌ర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫ‌ర్స్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 7:14 PM

త‌న ల‌వ్ స్టోరీల‌పై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ ప్రియా ఆనంద్. ద‌గ్గుబాటి రానా న‌టించిన ‘లీడ‌ర్’ సినిమాలో న‌టించిన‌ ప్రియా ఆనంద్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. లీడ‌ర్ చిత్రం త‌ర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అలాగే ‘రామరామ కృష్ణకృష్ణ’‌, ’18’0 వంటి సినిమాల్లో న‌టించింది. అయితే ప్రియ టాలీవుడ్‌లో స‌క్సెస్ కాలేక‌పోయింది. ఇక శ్రీదేవీతో క‌లిసి న‌టించిన ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంతో ప్రియా ఆనంద్ మ‌ళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామ ఇటీవ‌లే ప్రేమ‌లో ప‌డిందని ప‌లు వార్త‌లు త‌మిళ‌, తెలుగు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

దివంగ‌త న‌టుడు ముర‌ళి కుమారుడు, యంగ్ హీరో అధ‌ర్వ‌తో ఆమె ప్రేమ‌లో ఉన్న‌ట్లు కొన్ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రూ స‌న్నిహితంగా మెల‌గుతున్నార‌ని, ప్ర‌స్తుతం వీరు ప్రేమ‌లో ప‌డ్డార‌ని పుకార్లు వ్యాపించాయి. ఆ త‌ర్వాత న‌టుడు కార్తీక్ త‌న‌యుడు గౌత‌మ్‌తో ప్రియా ఆనంద్ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంద‌ని, వారిద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని పుకార్లు షికార్లు చేస్తూండ‌టంతో వీటిపై ప్రియా ఆనంద్ స్పందించింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని, గౌతమ్‌, అధ‌ర్వ‌లు నాకు మంచి స్నేహితుల‌ని, ముగ్గురం రెగ్యుల‌ర్‌గా మీట్ అవుతామ‌ని, ప‌లు విష‌యాలు చ‌ర్చించుకుంటామ‌ని చెప్పింది ప్రియ‌.

Read More:

బ్రేకింగ్ః క‌రోనాను జ‌యించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఓటీటీల్లో న‌టించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అర‌వింద్‌

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu