పవన్ కాంప్లిమెంట్ ఆ హీరోని ఎగిరి గంతేసేలా చేసింది

|

Sep 03, 2020 | 5:11 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సపోర్ట్ చేశాడంటే చాలు. ఆటోమేటిక్ గా సదరు వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోతుంది. విశేషంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తో ఉన్నలెక్కది. తాజాగా ఆ జాక్ పాట్ తనకు తగలడంతో వర్థమాన నటుడు సత్యదేవ్..

పవన్ కాంప్లిమెంట్ ఆ హీరోని ఎగిరి గంతేసేలా చేసింది
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సపోర్ట్ చేశాడంటే చాలు. ఆటోమేటిక్ గా సదరు వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోతుంది. విశేషంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తో ఉన్నలెక్కది. తాజాగా ఆ జాక్ పాట్ తనకు తగలడంతో వర్థమాన నటుడు సత్యదేవ్ ఒక్కసారిగా ఎగిరిగంతులేస్తున్నారు. విషయం ఏంటంటే.. టాలీవుడ్ లో విభిన్నమైన నటనతో తనను తాను నిరూపించుకుంటున్నారు సత్యదేవ్. వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన అతని ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సత్యదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒకే ఒక పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌గారికి హ్యాపీ బర్త్‌డే.. పుట్టినరోజు శుభాకాంక్షలు సర్’ అని సత్యదేవ్ పవన్ తో ఉన్న ఫొటోను ఉంచి ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌కు పవన్ స్పందించాడు.. ‘థాంక్యూ సత్యదేవ్ గారు. మీ తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో మీ పర్ఫామెన్స్ ను చాలా ఎంజాయ్ చేశా. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. అంతే.. పవన్ నుంచి వచ్చిన ఈ అనుకోని కాంప్లిమెంట్ సత్యదేవ్‌లో ఫుల్ జోష్‌ను నింపింది. ‘సర్..ర్..ర్.. .. చాలా ధన్యవాదాలు. మీ ప్రశంసను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ పుట్టిన రోజునాడు నాకు బహుమతి అందించినందుకు మరోసారి ధన్యవాదాలు. మీ మెసేజ్‌తో మా టీమ్ మొత్తం పరవశమైపోతోంది’ అని ట్వీట్ చేశాడు. అదీ సంగతి.