కేటీఆర్‌ను కలిసి చెక్‌ అందించిన హీరో రామ్‌

భారీ వర్షాలు, వదరల నేపథ్యంలో అతలాకుతలమైన హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల ప్రజలకు ఆదుకునేందుకు తాము సైతం అంటూ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ కోవలో సినిమా ప్రముఖలు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించగా తాజాగా హీరో రామ్ కూడా తనవంతు సాయం అందించారు. వరదల నేపథ్యంలో రెండురోజుల క్రితం తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25 లక్షలు విరాళం ప్రకటించిన రామ్‌.. […]

కేటీఆర్‌ను కలిసి చెక్‌ అందించిన హీరో రామ్‌

Edited By:

Updated on: Oct 22, 2020 | 2:37 PM

భారీ వర్షాలు, వదరల నేపథ్యంలో అతలాకుతలమైన హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల ప్రజలకు ఆదుకునేందుకు తాము సైతం అంటూ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ కోవలో సినిమా ప్రముఖలు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించగా తాజాగా హీరో రామ్ కూడా తనవంతు సాయం అందించారు. వరదల నేపథ్యంలో రెండురోజుల క్రితం తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25 లక్షలు విరాళం ప్రకటించిన రామ్‌.. గురువారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను స్వయంగా కలిసి చెక్‌ అందజేశారు.