సందడిగా నితిన్, షాలిని మెహెందీ వేడుక

|

Jul 25, 2020 | 7:57 AM

హీరో నితిన్‌, షాలినిల ఐదు రోజుల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌ నితిన్ వివాహానికి వేదికగా మారింది. ఈ క్రమంలోనే నవ వరుడు నితిన్‌కు..

సందడిగా నితిన్, షాలిని మెహెందీ వేడుక
Follow us on

హీరో నితిన్‌, షాలినిల ఐదు రోజుల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌ నితిన్ వివాహానికి వేదికగా మారింది. ఈ క్రమంలోనే నవ వరుడు నితిన్‌కు ఓ అద్భుతమైన బహుమతి లభించింది. పవన్​ వీరాభిమానైన నితిన్​ వివాహ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరు కావడంతో ఆయన సంతోషానికి అవుధులు లేకుండా పోయాయి.

కరోనా నిబంధనలనకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శుక్రవారం మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలను కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లో నితిన్ నీలం రంగు కుర్తాలో మెరిసిపోయారు. షాలిని ఎరుపు రంగు లెహెంగా వేసుకుని, డైమండ్ నెక్‌లేస్ ధరించి దేవకన్యలా కనిపించారు. షాలినీతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన.

ఆదివారం రాత్రి 8.30 నిమిషాలకు నితిన్​.. షాలిని మెడలో మూడుముళ్లు వేయనున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.